ప్రియమైన ప్రధాని గారు వీటికి సమాధానం చెప్పండి

ప్రియమైన ప్రధాని గారు.  ప్రధానిగా పదేళ్లు గడిచినా.

తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారు ?  ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు ? మా యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కి ఎందుకు పాతరేశారు ? మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు తెరువునిచ్చే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు బొంద పెట్టారు ? మా నవతరానికి కొండంత భరోసానిచ్చే ఐటిఐఆర్,  హైదరాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారు ?  తమ పిల్లల బంగారు భవిత పై ఆశలు పెట్టుకున్న లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు చల్లారని ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi )ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణకు ఒక్కటంటే ఒక్క నవోదయ,  మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల , ఐఐటి , ట్రిపుల్ ఐటీ,  ఐటిఐఎం,  ఎన్ఐఏడి ఎందుకు ఇవ్వలేదు ?  సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని,  మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారు ? లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిన 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న,  కాంగ్రెస్ సర్కార్ పాపానికి నేతన్నలు బలైపోతున్నా.తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని కేటీఆర్ ప్రశ్నించారు .

Ktr Comments On Pm Narendra Modi , Prime Minister Of India, Modhi ,ktr, Kcr, Te

చేనేత రంగంపై జిఎస్టి వేసి మగ్గానికి ఎందుకు మరణ శాసనం రాశారో చెప్పండి .తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను బిజెపి పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకు పోతున్నారు ? మండిపోతున్న నిత్యవసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోయారు,  ధరలు తగ్గి మోడీ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.అచ్చేదిన్ వంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదు.

మీ పాలనలో పదేళ్లు గడిచిన ఇంకా ఉచిత రేషన్ కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పాలని కేటీఆర్ ( Ktr )డిమాండ్ చేశారు.

Ktr Comments On Pm Narendra Modi , Prime Minister Of India, Modhi ,ktr, Kcr, Te
Advertisement
KTR Comments On PM Narendra Modi , Prime Minister Of India, Modhi ,ktr, KCR, Te

రేపు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ని కరీంనగర్ వరంగల్ జిల్లా( Karimnagar district)లో పర్యటించిన నేపథ్యంలో ప్రధాని మోదీని టార్గెట్ చేసుకొని తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అనేక అంశాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రశ్నించి ముందుగా వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు