కృతి శెట్టి డ్రీమ్ రోల్..!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో లైం లైట్ లోకి వచ్చిన కృతి శెట్టి వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది.

ప్రస్తుతం సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి చెప్పాలి, రామ్ తో ది వారియర్ సినిమాలు చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ అందుకుంది.

సూర్య సినిమాతో తమిళనాట గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అమ్మడు.ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్న కృతి శెట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ రోల్ ఏంటన్నది రివీల్ చేసింది.

తనకు రొటీన్ గా అనిపించే పాత్రలు చేయాలని లేదని.తన పాత్ర నచ్చితేనే సినిమా చేస్తానని.

ఇక తనకు రాకుమారిగా నటించాలని ఉందని అదే తన డ్రీమ్ రోల్ అని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.అమ్మడు ఓకే చెప్పాలే కానీ ఆమె కోసం రాకుమారి కథని సిద్ధం చేయడానికి డైరక్టర్స్ రెడీగా ఉన్నారని చెప్పొచ్చు.

Advertisement

ఇప్పటికే 3 వరుస హిట్లు అందుకున్న కృతి శెట్టి రాబోయే రెండు సినిమాలు కూడా హిట్లు కొడితే టాలీవుడ్ లో అమ్మడి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు