కమిటీలు, రిపోర్టులపై ఐవైఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ఐవైఆర్‌ కృష్ణారావు తెలుసు కదా.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన చీఫ్‌ సెక్రటరీగా ఉన్నారు.

బాబు సర్కార్‌కు, అమరావతికి వ్యతిరేకంగా ఈయన తరచూ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు.అంతేకాదు ఎవరి రాజధాని అమరావతి అంటూ ఓ బుక్ కూడా రాశారు.

అలాంటి ఐవైఆర్ కృష్ణారావు.తాజాగా రాజధానిపై కమిటీలు, వాటి రిపోర్టులపై స్పందించారు.

రాజధానిపై ఈ కమిటీలు ఇచ్చిన రిపోర్టులను పట్టుకొని ముందుకు వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కోర్టుల్లో షాక్‌ తప్పదని ఆయన స్పష్టం చేశారు.కమిటీలు ఎలాగూ ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్టులు ఇస్తాయని, అలా ఇచ్చే వాళ్లతోనే కమిటీలు ఏర్పాటు చేస్తారని కూడా ఐవైఆర్‌ అనడం గమనార్హం.

Krishnar Iyr Rao Ys Jagan Capitals
Advertisement
Krishnar Iyr Rao Ys Jagan Capitals-కమిటీలు, రిపోర్ట

జీఎన్ రావు కమిటీలోని అంశాలను ముఖ్యమంత్రి ముందే ప్రస్తావించారు.బీసీజీ కమిటీ అంశాలను మంత్రులు ముందే ప్రస్తావించారు.ఈ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

కానీ పై చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయి.రేపు న్యాయస్థానాలలో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలుగ చేయవచ్చు అని ట్విటర్‌లో ఐవైఆర్ తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు.

కమిటీల రిపోర్టుల కంటే ముందే ముఖ్యమంత్రి, మంత్రులు అందులోని వివరాలను చెప్పడం.భవిష్యత్తులో కోర్టుల్లో ఇబ్బందికర పరిణామాలను కొనితెచ్చుకునే సెల్ఫ్‌ గోలే అవుతుందని ఆయన చెప్పడం విశేషం.

ఈ పౌడ‌ర్‌ను వాడితే మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం వైట్ & బ్రైట్‌గా మార‌డం ఖాయం!
Advertisement

తాజా వార్తలు