ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను...స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ).

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా ఈ సినిమాలో కనిపించారు.ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .అయితే ఈ సినిమా స్మగ్లింగ్ నేపథ్యంలో హీరోని ఒక దొంగగా చూపిస్తూ చిత్రీకరించడంతో చాలామంది ఈ చిత్రంపై విమర్శలు కూడా చేశారు.

Krishna Vamsi Indirectly Sensational Comment On Pushpa Movie, Pushpa,allu Arjun,

ఇకపోతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి ఒక దర్శకుడు మాత్రం తనకు ఎన్ని డబ్బులు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా అసలు చేయను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయానికొస్తే ఆయన మరెవరో కాదు స్టార్ట్ డైరెక్టర్ కృష్ణ వంశీ( Krishna Vamsi ) అని చెప్పాలి.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

Krishna Vamsi Indirectly Sensational Comment On Pushpa Movie, Pushpa,allu Arjun,

ఈ క్రమంలోనే ఓ అభిమానీ కృష్ణవంశీ హర్రర్ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేశారు.ఈ కామెంట్ కు స్పందించిన కృష్ణవంశీ తాను కూడా హార్రర్ సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రిప్లై ఇచ్చారు.దీనికి మరో అభిమాని, ఓ రాబరీ మూవీ కూడా చేయండి సార్ అంటూ కామెంట్ చేయగా కృష్ణవంశీ స్పందిస్తూ చెడ్డ పనిని గొప్పగా చూపించడం అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు.

Advertisement
Krishna Vamsi Indirectly Sensational Comment On Pushpa Movie, Pushpa,Allu Arjun,

నేను అస్సలు అలా చేయలేను.సినిమా అనేది జనాల్లో మంచి ఆలోచనలు తెచ్చేలా ఉండాలి కాని చెడ్డ పనులను ప్రోత్సహించేలా ఉండకూడదు అలాంటి సినిమాలకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను చేయను అంటూ ఈయన మాట్లాడారు.

ఇలా కృష్ణవంశీ మాట్లాడటంతో కొందరు అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ స్పందిస్తూ కచ్చితంగా ఈయన పుష్ప సినిమా గురించి పరోక్షంగా మాట్లాడారు అంట కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు