కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన పూలబాల వెంకట ప్రసాద్ తెలుగు భాష సత్తాని చాటాడు.
బహుభాషా కోవిదుడైన వెంకట ప్రసాద్ తెలుగులో 1265 పేజీలగల భరతవర్ష నవలను 8 నెలల్లో రాసి వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు.
వెంకటప్రసాద్ తెలుగుతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మనీ, స్పానిష్, ఇటాలియన్ భాషల్లో మంచి దిట్ట.ఈ 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడడమే కాకుండా రచనలు కూడా చేశారు వెంకట ప్రసాద్.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మొదటి ఫ్రెంచ్ నవలా రచయిత ఈయనే.రికార్డు సాధించిన భరతవర్ష నవలలో 200 వృత్త పద్యాలు, 2.5లక్షల పదాలున్నాయి.వెయ్యి పేజీల నవల రాయడానికి ఎంతోమంది రచయితలు పదేళ్లకు పైగా సమయం తీసుకోగా.
మన వెంకట ప్రసాద్ కేవలం 8 నెలల్లోనే 1265 పేజీల భరతవర్షను రాయడం అరుదైన ఘటన అని చెప్పుకోవాలి.అందుచేతనే ప్రపంచ రికార్డును నెలకొల్పగలిగారు.దీనికోసం ఆయన రోజూ ఎంతో శ్రమించేవారు.
రాత్రివేళ కేవలం రెండు మూడు గంటలు మాత్రమే పడుకుని మిగతా సమయమంతా నవలను రాస్తూనే ఉన్నారు.తెలుగులో కష్టమైన 200 వృత్త పద్యాలతో కూడిన అతిపెద్ద గ్రాంధిక నవల రాయడం అంటే మామూలు విషయం కాదన్న సంగతి మీకు తెలిసినదే.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఇంకేమంటే, ట్రాన్స్ లిటరేషన్ టూల్‌ను వాడుతూ గూగుల్‌లో టైప్ చేస్టూ, మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో 2,50000ల పదాలను వందలసార్లు సవరించి ప్రపంచంలోనే అతిపొడవైన నవలను తానే సొంతంగా ముద్రించుకోవడం.ఈ స్సందర్భంగా వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, "నాకు ఎంతో ఆనందంగా వుంది.ఈ ప్రపంచ రికార్డు అనేది తెలుగు భాషకు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను.
ఈ నవలను అతి తక్కువ సమయంలో రాసే క్రమంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి.అయినా అవన్నీ నా లక్ష్యం ముందు చిన్నబోయాయి." అని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy