వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐగా కూన దుర్గాప్రసాద్

విశాఖపట్నం నగరంలోని వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐగా కూన దుర్గాప్రసాద్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో కంచరపాలెంలోని తన కార్యాలయంలో సీఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.

ముఖ్యమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు.నేరాల నియంత్రణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

యువత చెడు వ్యసనాలకు బానిసలు అయి వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.తమ డివిజన్ పరిధిలో రాత్రి వేళ గస్తీ మరింత ముమ్మరం చేస్తామన్నారు.

ప్రజలను మరింత అప్రమత్తం చేస్తామని చెప్పారు.నగర పోలీస్ కమీషనర్ సీహెచ్.

Advertisement

శ్రీకాంత్ ఆదేశాల మేరకు తన శక్తి వంచన లేకుండా నేరాల నియంత్రణకు కృషి చేస్తానని సీఐ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా పలువురు ఎస్ఐలు దుర్గాప్రసాద్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Plinko: Pagos Y Acceso A La Cuenta — Guía Práctica Para Jugadores En Chile
Advertisement

Latest Vizag News