మాజీ స్పీకర్‌ కోడెల కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌ మాజీ అసెంబ్లీ స్వీకర్‌ కోడెల శివప్రసాద్‌ నేడు తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా సమాచారం అందుతోంది.

ఉరి వేసుకోవడంను గమనించిన ఆయన సిబ్బంది వెంటనే ఆయన ఇంటి పక్కన ఉండే బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌కు తరలించడం జరిగింది.

అక్కడ కొద్ది సమయం చికిత్స చేసి బతికించేందుకు ప్రయత్నించారు.కాని డాక్టర్లు చేసిన ప్రయత్నం సఫలం కాలేదు.

కోడెల శివ ప్రసాద్‌ రావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉదయం 10 గంటల సమయంలో బయటకు వార్తలు వచ్చాయి.అయితే కుటంబ సభ్యులు మరియు పార్టీ నాయకులు మాత్రం అతడు ఉరి వేసుకోలేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు.

పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో ఏం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హైదరాబాద్‌లో ఆయన మృతి చెందడంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.

Advertisement

మొదట గుండె పోటుతో కోడెల మృతి అనుకున్నారు.కాని ఉరి అంటూ అనధికారికంగా క్లారిటీ వచ్చింది.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
Advertisement