కొడాలి నాని రాష్ట్రం వదిలి పారిపోతాడు..టీడీపీ నేత సీరియస్ వ్యాఖ్యలు..!!

గత కొద్ది రోజుల నుండి తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party )కి చెందిన కీలక నాయకులు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

గన్నవరం సభలో లోకేష్ తో పాటు చాలామంది నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ లపై మండిపడ్డారు.

తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన వెనిగండ్ల రాము పడాలి నాని పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం గుడివాడ( Gudivada )లో మీడియాతో వెనిగండ్ల రాము మాట్లాడుతూ కొడాలి నాని ఎమ్మెల్యే పదవికి విలువ లేకుండా చేస్తున్నారని అన్నారు.

గుడివాడకు పట్టిన దరిద్రం కొడాలి నాని.ఇక ఆయనను భరించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని విమర్శించారు.

వచ్చే ఎన్నికలలో కొడాలి నాని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని స్పష్టం చేశారు.సినిమా చివరిలో విలన్ పరిస్థితి ఇక్కడ కొడాలి నాని పరిస్థితి ఒకటేనని చెప్పుకొచ్చారు.

Advertisement

లోకేష్ కి. కొడాలి నాని( Kodali Nani )కి చాలా తేడా ఉందని అన్నారు.లోకేష్ చేయాల్సింది చేసుకుంటూ పోతారు.

కొడాలి నాని మాదిరిగా సొల్లు కబుర్లు చెప్పరు.కొడాలి నాని చేస్తున్న కుల రాజకీయాలు పట్ల ప్రజలు అసహనం చెందుతున్నారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు కొట్టే దెబ్బకు.కొడాలి నాని రాష్ట్రం వదిలి పారిపోక తప్పదు అంటూ వెనిగండ్ల రాము సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు