చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు.స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు పెట్టుకున్నారని విమర్శించారు.

చంద్రబాబు, లోకేశ్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ చేశారు.ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధం అయ్యారన్నారు.

రాజకీయంగా బతకడానికి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారని మండిపడ్డారు.రాజకీయాలంటే బట్టల వ్యాపారమా అని ప్రశ్నించిన కొడాలి ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు అబద్దాలు, వెన్నుపోటు అందరికీ తెలుసని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు