సూపర్ స్టార్ అన్నది ఐకాన్ స్టార్ గా మార్చారా..!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సొంత టాలెంట్ తో హీరోగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

తన లేటెస్ట్ సినిమా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఈ నెల 17న రిలీజ్ అవుతుంది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు.మురళి కిశోర్ అబ్బురు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా టీజర్ మెప్పించగా.ట్రైలర్ లో అసలు కథ రివీల్ చేశారు.

నైబర్ నెంబర్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.మన పక్క నెంబరే ఏ పవర్ స్టార్, ఐకాన్ స్టార్, రెబల్ స్టార్ ది అయ్యిండొచ్చు.

Advertisement

వారు మన కష్టాలు తీర్చొచ్చు అని హీరో చెబుతాడు.

అయితే అసలైతే ఆ డైలాగ్ లో ఐకాన్ స్టార్ అన్నది లేదు.సూపర్ స్టార్ అని చెబుతాడు కిరణ్ అబ్బవరం షూటింగ్ టైం లో సూపర్ స్టార్ అనగా డబ్బింగ్ లో సూపర్ స్టార్ అని కాకుండా ఐకాన్ స్టార్ అని చెప్పించారు.గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి ఐకాన్ స్టార్ అని చెప్పించడం లో అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ సూపర్ స్టార్ ని స్కిప్ చేయడంలోనే మహేష్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది.

కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.మరి అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు