నేటి నుంచే ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుని దర్శ‌నం

ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తుల‌ను నేటి నుంచి అనుమ‌తించ‌నున్నారు.ఈ విష‌యాన్ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

అయితే ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌య్య ఈ సారి పంచ‌ముఖ ల‌క్ష్మీగ‌ణ‌ప‌తిగా ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.కాగా, భ‌క్తుల సౌక‌ర్యార్థం ఈ సారి స్వామివారి ప్ర‌త్యేక పాదాల‌ను ప్ర‌ధాన విగ్ర‌హం స‌మీపంలో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

మ‌రికాసేప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ స్వామివారిని ద‌ర్శించుకుని ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.ఉద‌య‌మే ప‌ద్మ‌శాలి సంఘం త‌ర‌పున 50 అడుగుల జంధ్యం, కండువా, గ‌రిక‌మాల‌తో పాటు ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు