చరణ్ కాదన్న కథతో కెజిఎఫ్ యష్..!

కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో యష్ కె.

జి.ఎఫ్ చాప్టర్ 2 తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మరింత భారీ అంచనాలతో రాబోతుంది.రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఇక కె.జి.ఎఫ్ 2 తర్వాత యష్ తెలుగు డైరక్టర్ తో ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.టాలీవుడ్ మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో యష్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

KGF Yash Ok For Charan Rejected Story , Kgf, Kgf Yash, Prashanth Neel, Ram Char

అయితే యష్, బోయపాటి శ్రీను కాంబో సినిమా చరణ్ రిజెక్ట్ చేసిన కథతో వస్తుందని టాక్.బోయపాటి శ్రీను, రాం చరణ్ కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా వచ్చింది.

భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఆ సినిమా తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నారు బోయపాటి శ్రీను.

Advertisement

ఇక చరణ్ తో వినయ విధేయ రామ సినిమా కథ కన్నా ముందు చెప్పిన ఒక మాస్ అనుకున్నారట.అయితే ఆ కథతోనే బోయపాటి శ్రీను యష్ కాంబో సినిమా వస్తుందని అంటున్నారు.

మొత్తానికి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత బోయపాతి శ్రీను సినిమా వస్తుందని ఫిక్స్ అవ్వొచ్చు.

Advertisement

తాజా వార్తలు