విజయ్ కోసం కేజిఎఫ్ డైరెక్టర్.. మరి ఈ కాంబో ఏ రేంజ్ లో ఉంటుందో?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు.

విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.

అయితే గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ మరో హిట్ అందుకోలేక పోయారు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈ సినిమాపై విజయ్ ముందు నుండి చాలా అంచనాలను పెంచుకున్నాడు.కానీ ఇది బాగా నిరాశ పరిచింది.

మరి ఈ సినిమా ప్లాప్ నుండి మెల్లగా కోలుకున్న తర్వాత విజయ్ వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.మరి ఈయన లైనప్ లో ఖుషి (Khushi) సినిమా ఒకటి.

Advertisement

ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్టర్ చేస్తున్నాడు.సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.

మరి ఈ సినిమా చేస్తుండగానే విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అందులో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ ఉంది.ఈ సినిమాను సితార ఎంటెర్టైనమెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించ బోతున్నారు అని టాక్.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.విజయ్-గౌతమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు కేజిఎఫ్ సిరీస్ కు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన శివ కుమార్ ను ఫిక్స్ చేసారని టాక్.ఈ మూవీలో డార్క్ థీమ్ కూడా ఉండడంతో ఈయనను తీసుకుంటున్నట్టు టాక్.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంది.దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ధీమాగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు