తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ రాజ్ భవన్ లో రిపబ్లిక్ వేడుకల నిర్వహణలో భాగంగా ఆమె ప్రసంగించారు.

తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామన్న గవర్నర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని చెప్పారు.కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదన్నారు.

ఫామ్ హౌజ్ లు కట్టడం అభివృద్ధి కాదన్న ఆమె సగటు వారి ఆకాంక్షలు నెరవేరాలని తెలిపారు.మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.

రాష్ట్ర విద్యావ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని వెల్లడించారు.అదేవిధంగా తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.

Advertisement

కొందరికి తను నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు