ముంబై వేదికగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇవాళ ముంబై వేదికగా విపక్షాల ఇండియా కూటమి మూడో సమావేశం జరగనుంది.

మరోవైపు బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు కీలక సమావేశాలను నిర్వహిస్తుంది.దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది.2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్షాల ఇండియా కూటమి, అటు బీజేపీ వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తుండటం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు.అయితే ఉమ్మడి పోరుకు పదును పెట్టనున్న విపక్ష పార్టీలు రెండు రోజులపాటు భేటీలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే లోగోతో పాటు పదకొండు మందితో సమన్వయ కమిటీని ఖరారు చేసే అవకాశం కూడా ఉంది.కాగా ఈ సమావేశాలకు 28 పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

అదేవిధంగా కూటమికి సమన్వయకర్తను ఎన్నుకునే ఛాన్స్ కూడా ఉందని సమాచారం.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు