MP Sanjay Raut : కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం..: ఎంపీ సంజయ్ రౌత్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అరెస్ట్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

ప్రధాని మోదీ( Narendra Modi)కి కేజ్రీవాల్ అంటే భయమని ఆయన పేర్కొన్నారు.

అందుకే ఆయనను ఈడీతో అరెస్ట్ చేయించారని ఆరోపించారు.అయితే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన తరువాతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని తెలిపారు.

రాజకీయ నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకు మోదీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అలాగే ఈ నెల 31న రాంలీలా మైదానంలో ఆప్, ఇండియా కూటమి నిర్వహించనున్న బ్లాక్ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని ఆయన వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement