వామ్మో.. కీర్తి సురేష్ ఏంటి ఇంత సన్నగా అయిపోయింది!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రామ్ తో కలిసి నేను శైలజ సినిమాలో నటించిన సమయంలో కీర్తి సురేష్ కు నటన రాదు అన్న వారు మహానటి సినిమా చూశాక స్టార్ హీరోయిన్ అంటూ చెప్పుకొచ్చారు.అలాంటి కీర్తి సురేష్ కేవలం నటిగా మాత్రమే కాకుండా ఫ్యాషన్ డిజైనర్ గా కూడా గుర్తింపు పొందింది.

Keerthi Suresh, Very Thin, Weight Loss, Viral Video, Ram, Nenu Sailaja, 150 Sury

తెలుగులో ఎన్నో సినిమాలు చేసి నటి సావిత్రి గారి జీవిత చరిత్రను తెరకెక్కించిన మహానటి చిత్రానికి ఉత్తమ తెలుగు నటిగా అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ.హీరో రామ్ నటించిన నేను శైలజ సినిమా తో తెలుగులో మొదటిసారిగా పరిచయమైనా ఈ అందాల భామ ఈ సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

తెలుగులో దాదాపు 8 సినిమాలో నటించగా.తెలుగు పరిశ్రమకు పరిచయం కాకముందే తమిళం, మలయాళం సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

Advertisement

తెలుగులో సావిత్రి గారి బయోగ్రఫీక్ లో కీర్తి సురేష్ సావిత్రి గారిలా అచ్చు దిగినట్టుగా తన పాత్రలో నటించి జాతీయ అవార్డును గెలుపొందింది.ఈమధ్యే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ భామ లాక్ డౌన్ సమయంలో కొన్ని నెలల నుండి వ్యాయామాలు చేసిన వీడియో ను షేర్ చేయగా అందులో "150 సూర్యనమస్కారాలతో రోజును మొదలు పెడితే బాగుంటుందని, దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని" తెలిపారు.కాగా ఇటీవలే మరొక వీడియోను పోస్ట్ చేయగా 20 లక్షల మంది ఆ వీడియోను చూశారు.

కాఫీ డే సందర్భంగా విరామ సమయంలో వీడియో ను తీయగా.అందులో ఈ ముద్దుగుమ్మ ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా కాస్త కాఫీ తీసుకుంటుందని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ వీడియోలో దాదాపు సగానికి సగం బరువు తగ్గి అందరినీ షాక్ కు గురి చేసింది.దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

"కీర్తి సురేష్ మళ్లీ బరువు పెరుగు అంటూ" కొందరు కామెంట్ లు చేయగా, మరి కొద్ది మంది "మీరు ఇలానే బాగున్నారని" పోస్ట్ లు చేస్తున్నారు.ఇంతకుముందు వీడియోలో వ్యాయామాలు చేస్తూ కనబడిన కీర్తి ఈ వీడియోలో చాలా సన్నగా కనబడటంతో అందరిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

ఇటీవలే పెంగ్విన్ చిత్రంతో ముందుకు రాగా ప్రస్తుతం రంగ్ దే, అన్నాత్తె లో నటిస్తున్నారు.

తాజా వార్తలు