వంట గదిలో ఈ వస్తువులు పెడుతున్నారా..? అయితే డబ్బు నిలవడం కష్టమే..!

ఇంటికి వంట గది( Kitchen ) గుండె లాంటిది.ఎంత చక్కగా దాన్ని పెట్టుకుంటే ఇల్లు కూడా అంతే చక్కగా కనిపిస్తుంది.

ఇంటి నిర్మాణ సమయంలో అన్ని వాస్తు( Vastu ) ప్రకారం నిర్మిస్తారు.అలాగే కిచెన్ ను కూడా వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి.

కాబట్టి కిచెన్ లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే పెట్టుకోవాలి.లేదంటే వాస్తు దోషాలు ఏర్పడి అది జీవితం మీద చెడు ప్రభావం చూపిస్తుంది.

వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) ఉండేలా చూసుకోవాలి.అప్పుడే అన్నపూర్ణ దేవి సంతోషిస్తుంది.

Advertisement

వంటగది అగ్ని దేవుడి నివాసం అని అంటారు.ఇక చాలాసార్లు మనకి తెలుసో తెలియక కొన్ని వస్తువులు వంటగదిలో ఉంచడం వలన నెగటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది.

వంటగదిలో ప్రతికూల శక్తి మీ ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

కాబట్టి ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని వస్తువులు కిచెన్ లో పొరపాటున కూడా పెట్టకూడదు.పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడం కోసం ఈ వస్తువులు బయట తీసేయాలి.

లేదంటే ఆర్థిక సమస్యలతో( Financial Problems ) ఇబ్బంది పడాల్సి వస్తుంది.చాలామంది మిగిలిపోయిన పిండిని( Leftover Flour ) వంటగదిలో పెట్టేస్తూ ఉంటారు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
నూతన సంవత్సర క్యాలెండర్ ను విడుదల చేసిన టిటిడి.. శ్రీశైలం వెళ్లే భక్తులకు వాహనాలు నో ఎంట్రీ ఎందుకంటే..

కానీ అలా అస్సలు చేయకూడదు.పిండిని రాత్రంతా ఫ్రిజ్లో లేదా వంట గదిలో ఉంచడం వలన రాహువు, శని చెడు ప్రభావాల కారణంగా నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Advertisement

అది మీ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.కాబట్టి సరిపడినంత పిండిని మాత్రమే కలుపుకోవాలి.

కొంతమంది వంట గదిని మరింత అందంగా అలంకరించడం కోసం అద్దాలను పెడుతూ ఉంటారు.

మరి కొంత మంది చూసేందుకు చక్కగా ఉండాలనే ఉద్దేశంతో గాజు వస్తువులు( Glassware ) కూడా అల్మారాల్లో అమర్చి పెట్టుకుంటారు.కానీ ఇవి వంటగదిలో పొరపాటున కూడా పెట్టకూడదు.కిచెన్లో గాజు వస్తువులు ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది.

దీంతో ఆనందం, ప్రశాంతత మొత్తం తొలగిపోతుంది.ఇక వంటగది ఎప్పుడు కూడా క్లీన్ గా ఉండాలి.

మురికి ఉండడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.ఇలా చేయడం వలన లక్ష్మీదేవి( Lakshmidevi ) అనుగ్రహం ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చాలామంది కిచెన్ లో టాబ్లెట్లను( Tablets ) కూడా పెడుతూ ఉంటారు.అయితే వంటగదిలో మందులు ఉంచడం వలన ఇంటి సభ్యుల ఆరోగ్యం పై మరింత ప్రభావం పడుతుంది.

కాబట్టి వంటింట్లో మందులు అస్సలు పెట్టకూడదు.

తాజా వార్తలు