కేసీఆర్ అబ‌ద్ధ‌పు ముఖ్య‌మంత్రిః వైఎస్ ష‌ర్మిల‌

సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.ఆయ‌నొక అబ‌ద్ధ‌పు ముఖ్య‌మంత్రి అని ఆరోపించారు.

ఎనిమిదేళ్లుగా ఇచ్చిన ప్ర‌తి హామీ అబ‌ద్ధ‌మేన‌ని, ప్ర‌తి ప‌థ‌కం మోస‌పూరిత‌మేన‌ని మండిప‌డ్డారు.తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు త‌ప్ప ప్ర‌జ‌లెవ‌రూ బాగుపడ‌లేద‌ని విమ‌ర్శించారు.

కేసీఆర్ అరాచ‌కాల‌ను ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టామ‌న్నారు ష‌ర్మిల‌.తెలంగాణ గ‌డ్డ‌పై రాజ‌న్న రాజ్యాన్ని తీసుకొస్తామ‌ని చెప్పారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement