కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ : తెలంగాణలో మే మొత్తం లాక్‌డౌన్‌

దేశంలో మూడవ దశ లాక్‌డౌన్‌ను ఈనెల 17 వరకు కొనసాగించబోతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.

మొదటి నుండి లాక్‌డౌన్‌ విషయంలో ఒక అడుగు ముందే ఉంటున్న కేసీఆర్‌ అంతా అనుకున్నట్లుగానే కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కంటే పది రోజులు ఎక్కువగానే విధించాడు.

తెలంగాణ మంత్రి వర్గ మండలి నిన్న ఏడు గంటల సుదీర్ఘ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చలు జరిపారు.

లాక్‌డౌన్‌ సడలిస్తే వచ్చే సమస్యలు ఏంటీ, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితి ఏంటీ అనే విషయాలపై చర్చించడం జరిగింది.సుదీర్ఘ చర్చల తర్వాత సీఎం కేసీఆర్‌ స్వయంగా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించక తప్పడం లేదు.ఈ నెల 29 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులోనే ఉంటుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.

Advertisement

ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఒకే ఒక్క కరోనా నిరోదక ఆయుదం లాక్‌డౌన్‌.అందుకే లాక్‌డౌన్‌ను ఎక్కువ రోజులు పొడగిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కరోనాను నియంత్రించగలుగుతున్నామని కేసీఆర్‌ అభిప్రాయ పడ్డాడు.

దాంతో తెలంగాణలో మే నెల మొత్తం కోసం లాక్‌డౌన్‌ కొనసాగబోతుంది.అప్పటికి అయినా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా మళ్లీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటారా చూడాలి.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు