సొంత నియోజకవర్గంపై కేసీఆర్ నజర్... ఇక పనులు స్పీడందుకుంటాయా..

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ పై పూర్తి ఫోకస్ పెట్టారు.

అసలు ఎందుకు గజ్వేల్ లో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయంపై ఆయన ఆరా తీస్తున్నారు.

ఫామ్ హౌజ్ లో ఉండి అక్కడి నేతలైన వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ కలెక్టర్, ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామి రెడ్డితో చర్చలు జరిపారు.అసలు ఎందుకు ప్రజలు టీఆర్ఎస్ మీద వ్యతిరేఖంగా ఉన్నారో ఆరా తీస్తున్నారు.

ఎలాగైనా ఈ సారి జరిగే ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు.అసలే ఈ మధ్య అక్కడి నియోజకవర్గంలో ప్రతి పక్ష పార్టీల కార్యక్రమాలు చాలా ఎక్కువయ్యాయని చెబుతున్నారు.

ఇంతకీ అక్కడి ప్రజలు అధికార టీఆర్ఎస్ మీద ఎందుకు అసహనంతో ఉన్నారని చర్చిస్తే.తెలంగాణ ఏర్పడిన నుంచి అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉంటూ వస్తున్నారు.

Advertisement
KCR Looks At Own Constituency . Will Things Speed Up Anymore . KCR, Trs, Tspolt

అధికార హోదాలో అనేక కార్యక్రమాలను అక్కడ ప్రారంభించారు.కానీ అక్కడ ప్రారంభించిన కార్యక్రమాలు ఇప్పటికీ పూర్తి కాలేదని చెబుతున్నారు.

ఎందుకు అక్కడి కార్యక్రమాలు పూర్తి కాలేదని సీఎం నేతలను ప్రశ్నించారు.ఇక్కడి కార్యక్రమాలను స్పీడప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కార్యక్రమాలు స్పీడ్ అందుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

Kcr Looks At Own Constituency . Will Things Speed Up Anymore . Kcr, Trs, Tspolt

ఈ సారి ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది.అలా కాకుండా కేసీఆర్ ముందస్తుకు పోవాలని నిర్ణయిస్తే ఈ సమయం మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంది.కానీ గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం పనులు ఇప్పటి వరకూ కంప్లీట్ కాలేదు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలను సాటిస్ఫై చేయాలని టీఆర్ఎస్ చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు