సంతోష్ బాబును ప‌క్క‌న పెడుతున్నారా.. కార‌ణం కేటీఆర్ ఏనా..?

రాజ్య స‌భ స‌భ్యుడు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ఎవ‌రు అంటే గులాబీ బాస్ కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ కేసీఆర్ విష‌యాలు అన్నీ తానై చేసుకుంటాడ‌ని అంటుంటారు.సంతోష్ 2001లో టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు పీఏగా ఉంటూ అన్ని చూసుకున్నాడు.2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.అంతేకాకుండా రాజ్యసభలో టిఆర్‌ఎస్ విప్‌గా సంతోష్ కుమార్‌ నియమించారు.అయితే ఇవి అధికారికంగా అంద‌రికీ తెల‌సిన‌వే.

కానీ సంతోష్ కేసీఆర్ కు ఎంత సేవ చేసేవారో త‌ర‌చుగా ఆ నోట ఈ నోట వినేఉంటారు.కేసీఆర్ డే మొద‌లు ఆరోగ్యం వ‌ర‌కు అన్నీ తానై చేసుకుంటాడు.

ఇన్ని రోజులు బాగానే ఉన్నా ప్ర‌స్తుతం సంతోష్ ను కేసీఆర్ దూరం పెడుతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.ఇన్ని రోజులు ఫాం హౌస్ తో స‌హా అన్ని విష‌యాల్లో కేసీఆర్ కు చేదోడు వాదోడుగా వ్యవహరిస్తూ.

ఆయనకు సంబంధించిన అన్ని సంగతుల్ని చూసే విషయంలో సంతోష్ కు పోటీ వచ్చే వారే ఉండరని అనుకున్నారు.కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదంట‌.

Advertisement

స్వ‌యంగా చిన‌బాబు కేటీఆరే అందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.దీంతో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

క‌న్న తండ్రిలాగా అన్ని బాగానే చుసుకుంటున్న సంతోష్ ని దూరం చేయ‌డానికి కార‌ణం ఏంటో అని మాట్లాడుకుంటున్నారు.అంతే కాదు సంతోష్ స్థానంలో పెద్ద‌సారుకు మ‌రొక విధేయుడిని నియ‌మించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే కేసీఆర్ త‌న‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారిని తరచూ మారుస్తూ ఉంటారని టాంటుంటారు.ఉద్యమ కాలం నుంచి ఇప్ప‌టి వరకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిని చూస్తే చాలామంది నేతలు మార‌డం వారి ప్ర‌ధాన్య‌త కూడా త‌గ్గ‌డం చూస్తూనే ఉన్నాం.ఇప్పుడు స‌డెన్ గా సంతోష్ ని దూరం పెట్టాల‌నే ఆలోచ‌న ఎందుకు వ‌చ్చిన‌ట్లో అని అనుకుంటున్నారు.

రేపు కుటుంబ పోరు రాకూడ‌ద‌నా.లేక మ‌రే ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా అనే కోణంలో రాజ‌కీయ విశ్లేష‌కులు ఆలోచిస్తున్నారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

ఇందులో కేటీఆర్ ఎక్కువ చొర‌వ చూపార‌ని.ఇంతకాలం కేసీఆర్ కి సంబంధించిన విషయాల్ని చూసుకోవటంతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉంటూ వ్యవహారాల్ని నడిపించే సంతోష్ ను దూరం చేసి తనకు అత్యంత సన్నిహితుడైన ఓ ఎమ్మెల్సీని ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లు సమాచారం.అయితే ఈ ప్ర‌క్రియ గ‌తంలోనే మొద‌లైంద‌ని ఇప్పుడు అంద‌రికీ తెలిసేలా ఉంద‌ని అంటున్నారు.

Advertisement

మ‌రి నిజంగానే సంతోష్ కుమార్ ని దూరం చేయాల‌నే ఆలోచ‌న ఉందా.లేదా అనేది కాల‌యే స‌మాధానం చేప్తుంద‌ని అంటున్నారు.

తాజా వార్తలు