ఎన్నికల టీమ్ ను సిద్ధం చేస్తున్న కేసీఆర్ ! వారిద్దరికీ కీలక బాధ్యతలు ? 

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు.

బిజెపి, కాంగ్రెస్( BJP , Congress ) లకు ధీటుగా బీఆర్ఎస్ ను బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను పన్నుతున్నారు.

ముఖ్యంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతూ, పార్టీ కేడర్ లో ఉత్సాహం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అనేక హామీలు ఇస్తున్నారు.

పూర్తిగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెబుతున్నారు.అలాగే త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు కావలసిన ఆఫీసర్ల టీమ్ ను ముందుగానే ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

ఈ వ్యవహారాలపై మంత్రి హరీష్ రావు, సీఎం సెక్రెటరీ స్మిత సబర్వాల్ ( CM Secretary Smita Sabharwal )లిస్టు రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఏ అధికారి ఎక్కడ పని చేస్తున్నారు ? వారి సొంత జిల్లా ఏది ? ఏ పార్టీలలో వారి బంధువులు ఉన్నారు ? ఇలా అన్నిటిని లెక్కలు వేసుకుని జాబితాను సిద్ధం చేస్తున్నారు.నిన్న మంత్రి హరీష్ రావు తన పుట్టినరోజు ను కూడా పట్టించుకోకుండా సెక్రటేరియట్ కు వచ్చి ఆర్వోల నియామకాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
KCR Is Preparing The Election Team! Key Responsibilities For Both Of Them, Brs G

కెసిఆర్ సూచనలతో ఏ అధికారిని ఎక్కడ నియమించాలో సీఎంవో సెక్రటరీ స్మిత సభర్వాల్ చర్చించారట.

Kcr Is Preparing The Election Team Key Responsibilities For Both Of Them, Brs G

ఎన్నికల వ్యవహారాల్లో రిటర్నింగ్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారు.నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు వారు తీసుకునే నిర్ణయాలే ఫైనల్ గా ఉంటాయి.కేంద్ర ఎన్నికల సంఘం సైతం వీరిచ్చే రిపోర్టులు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది.

దీంతో వీరి నియామకాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఆర్వో లుగా నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 19 మంది తహసీల్దారులకు డిప్యూటీ కలెక్టర్ లుగా ప్రమోషన్ ఇచ్చారు.వారు రెవెన్యూ శాఖకు రిపోర్టు చేసిన వెంటనే పోస్టింగ్ ఇవ్వనున్నారు .

Kcr Is Preparing The Election Team Key Responsibilities For Both Of Them, Brs G
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఇంకా మిగతా కీలకమైన పోస్టులు విషయంలోనూ తమకు అనుకూలంగా ఉండే అధికారుల నియామకం పైనే బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించిందట.ఈ వ్యవహారాలన్నిటిని మంత్రి హరీష్ రావు తో పాటు, సీఎంవో సెక్రటరీ స్మిత సబర్వాల్ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు బి.ఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు