మళ్ళీ ఏపీ వైపు.." కే‌సి‌ఆర్ దూకుడు " !

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM KCR ) నిన్న మొన్నటి వరకు మహారాష్ట్ర రాజకీయాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపారు.

అక్కడ పర్యటనలు, వరుస బహిరంగ సభలు నిర్వహించడం, వంటివి చేస్తూ ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించడం, పార్టీకి కొద్ది రోజుల్లో నే విపరీతమైన హైప్ పెంచడం వంటివి చేస్తూ ప బి‌ఆర్‌ఎస్ ను అత్యంత వేగంగా బలపరుస్తున్నారు.దీంతో మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ విస్తరించిన తీరు అక్కడి ప్రధాన పార్టీలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసిందనే చెప్పవచ్చు.

అనుకున్న దానికంటే బి‌ఆర్‌ఎస్ వేగంగానే అక్కడ బలపడడంతో ఇప్పుడు కే‌సి‌ఆర్ తన ఫోకస్ ను ఏపీ వైపు మళ్లించారు.మామూలుగా అయితే కే‌సి‌ఆర్ మొదటి టార్గెట్ ఏపీనే.

Kcr Focus On Ap, Ap Politics , Kcr , Brs , Bjp, Ycp, Ys Jagan, Pawan Kalyan, Cha

తెలుగు రాష్ట్రం కావడం, అందులోనూ ఏపీలో కూడా కే‌సి‌ఆర్ కు మంచి గుర్తింపు ఉండడంతో బి‌ఆర్‌ఎస్ వేగంగా బలపడే అవకాశాలున్నాయని ఆ పార్టీ అధిష్టానం భావించింది.అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల ప్రభావం అధికంగా ఉంది.ఈ పార్టీలను కాదని ఏపీ ప్రజల దృష్టి బి‌ఆర్‌ఎస్ పై పడేలా చేయడం అంతా సులభమైన విషయం కాదు.

Advertisement
KCR Focus On AP, Ap Politics , Kcr , Brs , Bjp, Ycp, Ys Jagan, Pawan Kalyan, Cha

అందులోనూ గతంలో కే‌సి‌ఆర్ ఏపీ ప్రజలను చిన్న చూపు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.ఈ కారణాల చేత ఏపీలో పార్టీ విస్తరణను కాస్త హోల్డ్ లో పెట్టి మహారాష్ట్ర( Maharashtra )పై ఫోకస్ పెట్టి అక్కడ సక్సస్ అయ్యారు.

ఇప్పుడు అదే జోష్ తో ఏపీలో విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కే‌సి‌ఆర్.అందులో భాగంగానే నేడు బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party ) అధికారిక కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించనున్నారు ఏపీ బి‌ఆర్‌ఎస్ నేతలు.

Kcr Focus On Ap, Ap Politics , Kcr , Brs , Bjp, Ycp, Ys Jagan, Pawan Kalyan, Cha

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ కార్యక్రమానికి కే‌సి‌ఆర్ హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్థకమే.ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన హాజరు కావట్లేదానే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఆయన హాజరైతే ఏపీ బి‌ఆర్‌ఎస్ నేతల్లో మరింత జోష్ రావడం ఖాయం.ఇక పార్టీ కార్యలయం ప్రారంభించిన తరువాత తదుపరి కార్యకలాపాలపై ఏపీ బి‌ఆర్‌ఎస్ దృష్టి పెట్టె అవకాశం ఉంది.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

వచ్చే ఏపీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ అన్నీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఏపీ బి‌ఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్నీ స్థానాల్లో పోటీ చేసేందుకు బి‌ఆర్‌ఎస్ సిద్దమౌతోంది.

Advertisement

మరి ఏపీలో బి‌ఆర్‌ఎస్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు