బిగ్‌బాస్‌ : సీజన్‌ 3పై కౌశల్‌ కామెంట్స్‌, విన్నర్‌ ఎవరంటే

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 విజేత శివ బాలాజీ కాగా రెండవ సీజన్‌ విజేత కౌశల్‌.

మొదటి విజేత కంటే రెండవ విజేత అయిన కౌశల్‌కు బాగా పాపులారిటీ దక్కింది.

కౌశల్‌ ఆర్మీ అంటూ సోషల్‌ మీడియాలో గత ఏడాది చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.మూడు నాల్గవ వారంలోనే కౌశల్‌ ఆర్మీ ఏర్పాటు అయ్యి మెల్ల మెల్లగా అది కౌశల్‌ను విజేతగా నిలబెట్టింది.

కౌశల్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విజేతగా నిలిచిన తర్వాత చాలా బిజీ అయ్యాడు.మంచి పాపులారిటీ దక్కించుకోవడంతో పాటు, మంచి అవకాశాలు కూడా రాబట్టుకుంటున్నాడు.

తాజాగా ఈయన సీజన్‌ 3 గురించి తనదైన శైలిలో స్పందించాడు.

Advertisement

  ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్‌ మాట్లాడుతూ బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కంటెస్టెంట్స్‌ ఇంకా నటిస్తూనే ఉన్నారు.వారిలో ఏ ఒక్కరు కూడా జెన్యూన్‌గా ఆడుతున్నట్లుగా అనిపించడం లేదు.ప్రతి ఒక్కరు సేఫ్‌ గేమ్‌ ఆడుతూ వస్తున్నారు.

దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించడం లేదు.వారు ఎప్పుడైతే నటన మానేసి నిజంగా ప్రవర్తించడం మొదలు పెడతారో అప్పుడు అసలైన గేమ్‌ ప్రారంభం అవుతుందని కౌశల్‌ అన్నాడు.

ఇక ఈ సీజన్‌ లో విజేత ఎవరు అనే విషయంపై కౌశల్‌ స్పందించేందుకు నిరాకరించాడు.

  ఈ సీజన్‌లో తనకు ఫేవరేట్‌ అంటూ ఎవరు లేరని, ఒకవేళ ఉన్నా చెబితే అది ఇతరుల ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉందని కౌశల్‌ అన్నాడు.ఎవరి ఆట వారు ఆడుకునేలా తాను ప్రోత్సహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఇక సీజన్‌ 3 కి నాగార్జున గారు బాగా హోస్టింగ్‌ చేస్తున్నారని, మొదటి రెండు సీజన్‌ల మాదిరిగానే ఈ సీజన్‌ కూడా సక్సెస్‌ అయినందుకు సంతోషంగా ఉందన్నాడు.

How Modern Technology Shapes The IGaming Experience

బిగ్‌బాస్‌ అనేది ఒక అద్బుతమైన వేదిక.దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్‌పైన ఉంది.

Advertisement

తాజా వార్తలు