కాతువాకుల రెండు కాదల్ షూటింగ్ పూర్తి..!

విజయ్ సేతుపతి హీరోగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నయనతార, సమంత ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్న సినిమా కాతువాకుల రెండు కాదల్.

విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు.

ఈ సందర్భంగా సినిమా యూనిట్ అంతా కలిసి కేక్ కట్ చేశారు.విజయ్ సేతుపతి, నయనతార, సమంత ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుంది.

సినిమా టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి.కోలీవుడ్ లో లవ్ స్టోరీస్ కి విజయ్ సేతుపతి తో ప్రయోగాలు చేస్తుంటారు.

ఆల్రెడీ 96 సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు కాతువాకుల రెండు కాదల్ సినిమాని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక సమంత, నయనతారల గురించి చెప్పాల్సిన పనిలేదు.మరి కాతువాకుల రెండు కాదల్ తెలుగులో ఎలాంటి టైటిల్ తో వస్తుందో చూడాలి.

 సినిమాపై తెలుగు ఆడియెన్స్ కూడా క్రేజీగా ఉన్నారు.తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు