జక్కన్న సినిమాలకు లాజిక్ అవసరం లేదట.. కరణ్ జోహార్ క్రేజీ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత అయినా కరణ్ జోహార్( Karan Johar ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈయన తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

ఒకవైపు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రచారం అయ్యే షోలలో కూడా కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.ఇలా షోలు అలాగే సినిమాలు ఇలా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అయిన రాజమౌళి( Rajamouli ) గురించి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ.

కొన్ని సినిమాలు లాజిక్‌ కంటే నమ్మకం ఆధారంగా హిట్‌ అవుతాయి.

Advertisement

గొప్ప దర్శకుల సినిమాల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.సినిమాపై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్‌ గురించి పట్టించుకోరని వారు నిరూపించారు.ఉదాహరణకు రాజమౌళి సినిమాలను( Rajamouli Movies ) పరిశీలిస్తే.

ఆయన చిత్రాల్లో లాజిక్‌ల గురించి ప్రేక్షకులు ఎప్పూడూ మాట్లాడరు.ఆయనకు తన కథపై పూర్తి నమ్మకం ఉంటుంది.

ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు.ఆర్‌ఆర్‌ఆర్‌,( RRR ) యానిమల్‌,( Animal ) గదర్‌( Gadar ) ఇలాంటి వాటికి కూడా ఇదే వర్తిస్తుంది.

వీటి హిట్‌కు ఆయా దర్శకులపై ఉన్న నమ్మకం కూడా ఒక కారణం.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఒక వ్యక్తి హ్యాండ్‌ పంప్‌ తో 1000 మందిని కొడుతున్నట్లు చూపించినా అది సాధ్యమా, కాదా అని ఎవరూ చూడరు.సన్నీ దేవోల్‌ ఏదైనా చేయగలడని దర్శకుడు అనిల్‌శర్మ నమ్మారు.దాన్నే తెరపై చూపించారు.

Advertisement

దీంతో ప్రేక్షకులు కూడా నమ్మారు.ఫలితంగా గదర్‌ 2 బ్లాక్‌ బస్టర్ హిట్ అయ్యింది.

సినిమా విజయం పూర్తిగా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.లాజిక్‌ల గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదు.

సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలి అని కరణ్ జోహార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ కామెంట్స్ పై కొందరు స్పందిస్తూ కరెక్ట్ గా చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు