అలాంటి వారే ఇలాంటి వారికి జన్మ నిస్తారు అంటూ నిప్పులు చేరిగిన బ్యూటీ

నిర్భయ దోషులను మన్నించాలి అంటూ కోరిన లాయర్ ఇందిరా జైసింగ్ పై బాలీవుడ్ నటి కంగనా రౌనత్ తీవ్ర స్థాయిలో మండిపడింది.

ఇటీవల లాయర్ ఇందిరా జైసింగ్ సోనియా గాంధీ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నిర్భయ దోషులను మన్నించాలి అంటూ సంచలన సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆమె సలహా పై నిర్భయ తల్లి కూడా స్పందించి వారు మరణిస్తేనే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది అంటూ నిరాకరించింది.అయితే ఇదే అంశం పై తాజాగా కంగనా స్పందిస్తూ జైసింగ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Kangana Ranauth Commentson Indira Jaisingh-అలాంటి వారే ఇ�

ఒక నాలుగు రోజుల పాటు ఆమెను కూడా ఆ దోషుల తో పాటు జైల్లో పెట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా ఇలాంటి మహిళలే అలాంటి రేపిస్టులకు, కామాంధులకు, హంతకులకు జన్మ నిస్తారు అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.బస్సులో వెళుతున్న నిర్భయ పై అత్యంత పైశాచికంగా నిందితులు ప్రవర్తించిన తీరు అందరినీ కలచి వేసింది.

అలాంటి ఘోరానికి పాల్పడిన నిందితులకు 7 సంవత్సరాల తరువాత ఉరిశిక్షలు ఖరారు చేయగా దానికి సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వారిని క్షమించాలి అంటూ నిరుబ్బయ తల్లికి సలహా ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

తాజా వార్తలు