వైరల్ వీడియో: మటన్ కర్రీ ఎంత పని పెట్టింది.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న ఎముక.. చివరకు..

ఈరోజుల్లో ఆదివారం వస్తే ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ తప్పనిసరి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది.

వారం అంతా కూరగాయాతో కుస్తీ పట్టిన మాంసాహార ప్రియులు ఆదివారం వస్తే చాలు తినే ప్లేట్ లో నాన్‌వెజ్ తప్పనిసరి ఉండాల్సిందే.

పళ్ళెం నిండా మంచి మంచి ముక్కలు, నల్లి తొక్కలు వేసి ఎంతో ఆనందంగా తింటారు.నిరుపేదలు, మధ్యతరగతి వారు కోడిమాంసం, చేపలతో సర్దుకు పోతుండగా.

, ఆర్థిక స్థోమత ఉన్నవారు రాత్రి భోజనానికి మటన్( Mutton ) మాంసం తింటారు.

కొన్ని సందర్భాల్లో, ఈ మాంసాహారం మన జీవితాలను నాశనం చేస్తుంది.ఇలాంటి ఘటనే యాద్రాద్రి జిల్లా( Yadadri District ) ప్రాంతంలో చోటుచేసుకుంది.ఇక ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.

Advertisement

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన అనంతుల శ్రీరాములు( Anantula Sriramulu ) మంగళవారం మటన్ కర్రీ తింటుండగా గొంతులో ఎముక( Bone ) అడ్డుపడింది.దీని కారణంగా, వృద్ధుడు నానా అవస్థలు పడ్డాడు.

దాంతో ఎలాగైనా ఎముకను బయటకు తీయాలని కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు.అయితే ఎముక బయటకు రాకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

అనంతరం అక్కడ ఎండోస్కోపీ సహాయంతో మాంసం ఎముకని తొలగించి వృద్ధుడి ప్రాణాలను కాపాడారు.దాంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.మాంసాహారం తినడంలో ఎలాంటి తప్పులేకపోయినా.

తినడానికి ముందు ఆహారాన్ని కాస్త తనిఖీ చేయాలని వైద్యులు చెబుతున్నారు.లేకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు పేర్కొన్నారు.

సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఇవి రాత్రిపూట తింటే చాలు..!
Advertisement

తాజా వార్తలు