రజనీ సరే అంటే నేను సి‌ఎం గా రెడీ

తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్ రాకతో అక్కడ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త పార్టీని పెట్టబోతున్నట్లుగా ఇది వరకే ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.

అదే రోజు పార్టీ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది.తమిళ పార్టీలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాలు మొదలు పెట్టారు.

రజినీకాంత్ పార్టీ ని స్థాపించిన సి‌ఎం గా మాత్రం కొనసాగనని చెప్పాడు.ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ను, రజినీకాంత్ సి‌ఎం గా మిమ్ములను కోరితే మీరు సిద్దమేన అన్న ప్రశ్నకు, రజినీకాంత్ సి‌ఎం గా కొనసాగకపోతే మాత్రం ఆయన ఆదేశాను సారం నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరితే పోటీ చేసేందుకు నేను సిద్దంగా ఉన్నాను అన్నారు.

ఎన్నికల ప్రచారంలో బాగంగా కమల్ హాసన్ సోమవారం నాడు కాంచిపురం జిలాల్లో పర్యటించాడు.చిన కాంచిపురంలోని చేనేత కార్మికులను కలుసుకున్నారు.మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం చేనేత కార్మికుల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెడతా అన్నారు.

Advertisement

ఈ సందర్భంలోనే అధికార పార్టీ పై విమర్శలు చేశాడు.డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వం.ప్రజల కష్టాలను తీర్చడంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించాడు.

మొదటి నుండి తమిళనాడు రాజకీయాల్లో సినిమా నటులకు ప్రత్యేకమైన స్థానం ఉంది.త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు