రాజమౌళి మహేష్ బాబు సినిమా లో తమిళ్ స్టార్ హీరో నటిస్తున్నాడా..? అయితే ఇక రచ్చ రచ్చే..

తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి.

( Rajamouli ) ప్రస్తుతం రాజమౌళి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది.మరి అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో ఒక సూపర్ సక్సెస్ లను సాధించే విధంగానే ప్రయత్నం చేస్తాడు.

అందులో ఆయన సక్సెస్ కూడా అవుతూ ఉంటాడు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన లోక నాయకుడైన కమల్ హాసన్( Kamal Haasan ) కూడా ఒక కీలకపాత్ర లో నటిస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక నిన్న మొన్నటి వరకు వేరే హీరోల పేర్లు వినిపించినప్పటికీ ఎప్పుడు మాత్రం ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర వహిస్తున్నాడు అంటూ తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వార్త బయటికి వచ్చింది.రీసెంట్ గానే కమలహాసన్ కల్కి,( Kalki ) భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ఈ రెండు సినిమాల్లో కల్కి సినిమా సూపర్ సక్సెస్ గా నిలిస్తే, భారతీయుడు 2 మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

Advertisement

కాబట్టి ప్రస్తుతం రాజమౌళి కమలహాసన్ తో విలన్ పాత్రలో నటింపజేస్తున్నాడా లేదంటే హీరో అన్నయ్య పాత్రలో నటింపజేస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే లోకనాయకుడిని రాజమౌళి తీసుకొని మంచి పని చేసారు అంటూ చాలామంది ఈ వార్త పైన స్పందిస్తున్నారు.ఇక కమల్ హాసన్ లాంటి నటుడు మన ఇండియాలో ఉండడం నిజంగా మన అదృష్టం అంటూ సోషల్ మీడియా లో ఒకపోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది.

ఎందుకంటే ఆయన ఎలాంటి పాత్రనైనా సరే అలవోకా గా చేసి మెప్పిస్తుంటాడు.

Advertisement

తాజా వార్తలు