చిరు సలహా కు తనదైన శైలి లో సమాధానం చెప్పిన కమల్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ నిర్మాణసారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా.

ఈ చిత్రం అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఒకానొక సందర్భంలో చిరు తన స్నేహితులు అయిన సూపర్ స్టార్ రజనీకాంత్,లోక నాయకుడు కమల్ హాసన్ లకు రాజకీయాలపై ఒక క్లారిటీ అందించారు.మీరు రాజకీయాల్లో నెగ్గుకు రావాలి అంటే చాలా కష్టం కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటే బెటర్.

ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కూడా చిరు ప్రస్తావించారు.నేను, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజకీయాల్లో ఎంతో పోగుట్టుకున్నాం.

అప్పట్లో నేను కూడా పాలకొల్లు నుంచి ఓడిపోయాను.తాజాగా తన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Advertisement

  ప్రస్తుత రాజకీయాలన్నీ ధన, కుల ప్రవాహంలో ఉండటంతో ఎంత సూపర్ స్టార్స్ వచ్చినా ఇక్కడ తట్టుకుని నిలబడటం కష్టమని సలహా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.అయితే చిరు సలహా పై కమల్ తనదైన శైలి లో గట్టి కౌంటర్ ఇచ్చారు.నాకు చిరంజీవి మంచి మిత్రుడు.

ఆయన సలహాలు నేను పాటించాలనుకోవడం లేదు.నేను రాజకీయాల్లో వచ్చింది వ్యవస్థను బాగు చేయడం కోసమే అని,భవిష్యత్తులో రాజకీయాల గురించి నాకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని చిరంజీవికి కాస్త గట్టిగానే సమాధాన మిచ్చాడు.

పాలిటిక్స్ అంటేనే ఇలా ఉంటాయని నాకు తెలుసు, అందులో మార్పు కోసమే నేను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానన్నారు.ఈ విషయమై చిరంజీవి ఫ్యాన్స్ కమల్ హాసన్ పై గుర్రుగా ఉన్నారు.

కానీ కమల్ హాసన్ చిరుకు గట్టి కౌంటర్ ఇచ్చినా, రజినీకాంత్ మాత్రం చిరంజీవి చెప్పిన సలహాపై మౌనంగానే ఉన్నారు.విశేషం ఏమిటంటే కమల్ హాసన్.

ప‌చ్చి ఉల్లిపాయ తింటే ఆ శ‌క్తి పెరుగుతుంద‌ట‌..తెలుసా?

చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ తమిళ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ అందించారు.

Advertisement

తాజా వార్తలు