రికార్డుల కోసం కల్కి సినిమా తీయలేదు.. స్వప్న దత్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా అన్ని భాషలలోని ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంచలనాలను సృష్టిస్తోంది.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన కల్కి సినిమా కలెక్షన్ల పరంగా, టాక్ పరంగా సంచలనాలను సృష్టిస్తోంది.ఇక ఈ సినిమా మొదటిరోజు సుమారు 191.5 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు అధికారకంగా వెల్లడించారు.

Kalki Producer Swapna Dutt React On Kalki Collections, Kalki, Swapna Dutt, Colle

ఇక చాలామంది ఇప్పటివరకు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందని తెలుసుకోవడం కోసం ఆతృత కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్ల గురించి నేటిజన్స్ నిర్మాత స్వప్న దత్( Swapna Dutt ) ను ప్రశ్నిస్తూ ఉన్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా స్వప్న దత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.

నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది చాలామంది ఫోన్లు చేసి ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ ఎంత అంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

Kalki Producer Swapna Dutt React On Kalki Collections, Kalki, Swapna Dutt, Colle
Advertisement
Kalki Producer Swapna Dutt React On Kalki Collections, Kalki, Swapna Dutt, Colle

ఇలా అడగడం చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తుందని ఈమె తెలిపారు.మేము సినిమాలు చేస్తున్నది రికార్డులను సాధించడం కోసం కాదని సినిమాపై మక్కువతో ప్రేక్షకుల ఆనందం కోసం సినిమాలు చేస్తున్నామని ఈమె ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.అయితే ఇప్పటివరకు ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలు మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కల్కి సినిమా సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాని అశ్వినీ దత్ తో పాటు స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు