'గేమ్ ఛేంజర్' బాటలో నడుస్తున్న కల్కి.. కేసు ఫైల్ చేయనున్నారట.. కారణం అదే!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా దీపికా పదుకొనె( Deepika Padukone ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD.

( Kalki 2898 AD ) పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల స్టార్స్ ను నాగ్ అశ్విన్ తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్స్ అందరిని ఆకట్టు కోవడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లేలా చేసాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి.

Advertisement

ఈ లీక్స్ విషయంలో ఇప్పుడు టీమ్ కఠిన చర్యలు తీసుకో బోతుంది అనే టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్( Game Changer Movie ) నుండి కూడా లీక్స్ కాగా మేకర్స్ ఈ విషయంలో కేసు ఫైల్ చేసి కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.మరి ఇదే బాటలో కల్కి మేకర్స్ కూడా నడవ బోతున్నారని సమాచారం.

కల్కి యూనిట్ తాము వర్క్ ఇచ్చిన విఎఫ్ఎక్స్ కంపెనీపై( VFX Company ) కేసు పెట్టనున్నారని సమాచారం.అనివార్య లీక్స్ కారణంగానే ఈ కంపెనీపై కేసు పెట్టేందుకు సిద్ధం అయ్యారని దీని గురించి రానున్న రోజుల్లో మరింత సమాచారం అందే అవకాశం ఉందని టాక్.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు