పెళ్లి తర్వాత తొలిసారి షూటింగ్ లో పాల్గొన్న కాజల్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.పెళ్లి తర్వాత కాజల్ నటిస్తున్న మొదటి సినిమా ఇది.నిన్ననే కాజల్, మంచు విష్ణు జంటగా నటించిన మోసగాళ్లు సినిమా రిలీజయింది.చాలా రోజుల తర్వాత కాజల్ నటించిన తెలుగు సినిమా రిలీజవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మోసగాళ్లు సినిమాలో కాజల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది ఇలా ఉండగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంది.

పెళ్లి తర్వాత మొదటిసారి షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా చిత్ర యూనిట్ కాజల్ కు ఘానా స్వాగతం పలికింది.కాజల్ తన భర్తతో కలిసి సెట్ దగ్గరకు వచ్చింది.

Advertisement
Kajal Step Into Chiranjeevi Acharya Movie Set, Kajal Agarwal, Chiranjeevi, Achar

ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియాలో తెలిపింది.ఒక ఫోటోను షేర్ చేస్తూ ఎవరిదో గెస్ చేయమంటూ పోస్ట్ చేసింది.

చిత్ర యూనిట్ లొకేషన్ కు వచ్చిన కాజల్ కు బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు.కేక్ కూడా కట్ చేసి పెద్ద సెలెబ్రేషన్స్ చేసారు.

మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమాను శరవేగంగా షూటింగ్ జరిపి త్వరగా పూర్తి చేయాలనీ కొరటాల శివ చూస్తున్నాడు.మొన్నటి వరకు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరిపారు.

Kajal Step Into Chiranjeevi Acharya Movie Set, Kajal Agarwal, Chiranjeevi, Achar

ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.దాదాపు 40 నిముషాల నిడివి గల పాత్రను రామ్ చరణ్ చేస్తున్నాడు.ఈ మధ్యనే బొగ్గు గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్

ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని కొరటాల శివ తెలిపారు.ఈ సినిమా మే 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు