నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ ఎదుట హాజరుకానున్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఎంపీ అవినాశ్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారించనుంది.

కాగా ఇప్పటికే పలు దఫాలుగా అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.అయితే సీబీఐ విచారణ నేపథ్యంలో ఇవాళ కార్యక్రమాలను ఎంపీ అవినాశ్ రెడ్డి రద్దు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు