Mudragada vs KA Paul : ముద్రగడ్డకు సీఎం ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముద్రగడ( Mudragada Padmanabham ) వ్యవహారం కీలకంగా మారింది.

ఈ ఏడాది ప్రారంభంలో ముద్రగడ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెగ ప్రచారం జరిగింది.

ఏపీలో జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ నుండి ఆయన పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.ఇదే విషయాన్ని జనసేన పార్టీకి చెందిన నాయకులు కూడా తెలియజేశారు.

సంక్రాంతి పండుగ తర్వాత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్వయంగా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.

ముద్రగడ వైసీపీ లోకి వెళ్లడానికి రెడీ అయ్యారు.

Advertisement

రెండు రోజుల క్రితం కిర్లంపూడిలో వైసీపీ( YCP ) ముఖ్యనేతలతో భేటీ అయి త్వరలో మంచి రోజు చూసుకుని వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ( KA Paul )స్పందించారు.అవినీతికి మారుపేరైన వైసీపీలో చేరే కంటే తన పార్టీలో చేరటం బెటర్ అని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి బాబు మోహన్ రావు దారిలోనే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నడవాలని కేఏ పాల్ సూచించారు.నా పార్టీలో చేరితే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా.

మీ తరఫున పది సీట్లు కేటాయిస్తా.నా మాట కాదని వైసీపీ( YCP )లో చేరితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.

నాతో కలిస్తే చరిత్రకెక్కుతారు అని కేఏ పాల్ స్పష్టం చేశారు.

Validation Check 2026
Advertisement