ఒక్క ఆధార్ అప్‌డేట్ చేస్తే ఇతర డాక్యుమెంట్లలో కూడా మీ డేటా ఆటో అప్‌డేట్ అయిపోతోంది!

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్లను ఆటోమాటిక్ అప్‌డేట్ చేసే పనిలో పడింది.

సంబంధిత వ్యవస్థను త్వరలో ప్రవేశ పెట్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

దీనికి సంబంధించి ప్రాసెస్ ఇంకా ప్రాథమిక దశలో ఉందని, తుది వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కొంత సమయం పట్టవచ్చునని తెలుస్తోంది.ఆధార్ సంబంధిత సెక్షన్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలక డేటా అంటే రేషన్ కార్డ్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఓటర్ ఐడి కార్డ్‌లు వంటి డేటాను అప్‌డేట్ చేయడానికి యూజర్లను అనుమతించనుంది.

ఇలాంటి ఆటో అప్‌డేట్ సిస్టమ్ సిస్టమ్ రూపొందించాలని ప్రభుత్వం ఎప్పటినుండో పనిచేస్తుంది.

Just Updating Aadhaar Will Automatically Update Your Data In Other Documents Too

కాగా ఎట్టకేలకు ఒక దశకు చేరుకుందని తెలుస్తోంది.ఇక్కడ మంత్రిత్వ శాఖలు, పౌరులు తమ ఆధార్ కార్డుకు అప్‌డేట్ చేసినప్పుడల్లా ఆటో-అప్‌డేట్‌ అయిపోతూ ఉంటాయి.ఆధార్‌లోని ఇంటి అడ్రస్ వంటివి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేయొచ్చు.

Advertisement
Just Updating Aadhaar Will Automatically Update Your Data In Other Documents Too

అయితే పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ID వంటి ఇతర వివరాలు ఆఫ్‌లైన్ కేంద్రాల ద్వారా మాత్రమే అప్‌డేట్ చేయబడతాయి అని గుర్తించుకోండి.డిజిలాకర్‌లో కీలకమైన ప్రభుత్వ పత్రాలను స్టోర్ చేసే యూజర్లకు ఈ సిస్టమ్ ప్రాథమికంగా సాయపడుతుందని నివేదిక పేర్కొంది.

Just Updating Aadhaar Will Automatically Update Your Data In Other Documents Too

డిజిలాకర్‌ (DigiLocker) గురించి అందరికీ తెలిసిందే.వినియోగదారులకు లైసెన్స్‌లు, పాన్ కార్డ్‌లు వంటి మరిన్నింటి డాక్యుమెంట్లను డిజిటల్‌గా సేవ్ చేయడానికి ఇది పనికి వస్తుంది.ఆధార్ కార్డ్‌లో చేసిన మార్పులు డిజిలాకర్‌లోని ఇతర డాక్యుమెంట్లలో కాన్సెంట్ ఫ్రేమ్‌వర్క్’పై పనిచేస్తాయి.

డిజిలాకర్ ఆటో-అప్‌డేట్ సర్వీసు కావాలో లేదో ఇక్కడ తేలికగా ఎంచుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే, పది మంత్రిత్వ శాఖలలో ఆధార్‌పై వారి అడ్రస్ అప్‌డేట్ చేసే పౌరులు ఇతర మంత్రిత్వ శాఖల రికార్డులలో కూడా దానిని ఆటోమాటిక్‌గా అప్‌డేట్ చేయాలని అనుకున్నపుడు 10 మంత్రిత్వ శాఖలలో కేవలం 2 మంత్రిత్వ శాఖలలో మాత్రమే అప్‌డేట్ అవుతుంది.

అప్పుడు డ్రాప్‌డౌన్ మెనులో ఆయా మంత్రిత్వ శాఖలను చెక్‌మార్క్ చేయొచ్చు.

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ తాగితే ప్రమాదమా...
Advertisement

తాజా వార్తలు