జూనియర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లీక్ అయ్యింది..!

నిన్న జరిగిన ఇజం ఆడియోలో తారక్ మాటలు అందరిని ఉత్సాహం పరచడమే కాకుండా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

జగన్ తో టెంపర్ తీశాకే తనలో కాన్ ఫిడెన్స్ పెరిగిందని టెంపర్ కు ముందు తర్వాత తన మీద తనకు నమ్మకం పెరిగిందని అన్నారు.

జగన్ రాసిన కథలన్ని నాతో డిస్కస్ చేస్తారని ఈ కథ అద్భుతంగా ఉందని కళ్యాణ్ రాం అన్నకి చేయమని చెప్పింది నేనే.ఇక అన్నయ్య కళ్యాణ్ రాం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Junior Girl Friend Leaked-Junior Girl Friend Leaked-Latest News - Telugu-Telugu

కళ్యాణ్ రాం గురించి మాట్లాడే సందర్భంలో అన్నయ్య గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియట్లేదు అన్న జూనియర్ తనకు కేవలం కళ్యాణ్ రాం అన్న గానే కాదు మంచి స్నేహితుడు, వెల్ విషర్, ఇక కొన్ని సమయాల్లో గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఉంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.అన్నదమ్ముల మధ్య ఈ సఖ్యత నిజంగా ఫ్యాన్స్ కు పండుగలా అనిపించింది.

అక్టోబర్ 20వ రిలీజ్ అవుతున్న ఇజం కళ్యాణ్ రాం కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తాజా వార్తలు