త్రివిక్రమ్‌ ఆ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఊరుకుంటారా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నాడు.అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అవ్వడంతో కాస్త ఎక్కువ సమయం తీసుకుని, పక్కాగా అరవింద సమేతను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని త్రివిక్రమ్‌ భావిసున్నాడు.

అందుకే సినిమాను ఆలస్యంగా ప్రారంభించడంతో పాటు, ప్రతి సీన్‌ను జాగ్రత్తగా షూట్‌ చేస్తున్నారు.స్క్రిప్ట్‌ విషయంలో పలు మార్పులు చేర్పులు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను ఇంప్లిమెంట్‌ చేస్తున్నాడు.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయాలని భావించారు.కాని షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా, హడావుడిగా చిత్రీకరణ చేస్తే క్వాలిటీ లోపిస్తుందనే ఉద్దేశ్యంతో రెండు వారాలు ఆలస్యంగా సినిమాను తీసుకు వచ్చే ఆలోచనలో దర్శకుడు త్రివిక్రమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఇదే విషయంపై దర్శకుడు త్రివిక్రమ్‌ ఇప్పటికే ఎన్టీఆర్‌తో కూడా చర్చించినట్లుగా సమాచారం అందుతుంది.

ఎన్టీఆర్‌ మాత్రం సాధ్యం అయినంత వరకు ముందుగా అనుకున్న ప్రకారం దసరాకు విడుదల చేద్దాం, సాధ్యం కాదు, షూటింగ్‌ పూర్తి అవ్వదు అనుకుంటే అప్పుడు వాయిదా వేసేద్దాం అంటూ చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది.దసరాకు సెలవులు ఎక్కువగా ఉండటంతో పాటు, మంచి సినిమాల సీజన్‌, అందుకే ఎక్కువగా అరవింద సమేత చిత్రాన్ని దసరాకు రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.ఒకవేళ త్రివిక్రమ్‌ సినిమాను ఆలస్యం చేయాలని నిర్ణయించుకుంటే ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

‘జైలవకుశ’ చిత్రం విడుదల అయ్యి సంవత్సరం కాబోతున్న నేపథ్యంలో ఇంకా కూడా ఎన్టీఆర్‌ మూవీని ఆలస్యం చేస్తే ఫ్యాన్స్‌ సీరియస్‌ అవ్వడం ఖాయం.అందుకే త్రివిక్రమ్‌ సినిమాను ఆలస్యం కాకుండా, త్వరత్వరగా పూర్తి చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మొత్తానికి త్రివిక్రమ్‌ సినిమా హడావుడి అవ్వనుండా లేదంటే ఆలస్యం అవ్వనుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
Advertisement