టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కొరటాల శివ( Koratala Siva ) కాంబినేషన్ లో తెరరకెక్కిన సినిమా దేవర.( Devara ) భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
అలాగే బాగానే కలెక్షన్లను సాధించింది.డివైడె టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం రఫ్ఫాడించింది అని చెప్పాలి.
ఈ సినిమాతో ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ సైతం బ్రేక్ చేశారు.ఇటీవల ఈ సినిమానే జపాన్ లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది.మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా జపాన్ లో ఉన్న ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్కు చేరుకున్నారు.అయితే ఎన్టీఆర్ అక్కడ జపాన్ మీడియాలో దేవర 2( Devara 2 ) పై ఇచ్చిన అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
తాను దేవర 2 కోసం మాట్లాడుతూ ఇపుడు దేవర 2 చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది.దేవర 1 కన్నా పార్ట్ 2 లో చాలా పెద్ద కథ, పార్ట్ 1 లో దేవర కోసం చాలా నేర్చుకున్నారు.
దేవర 1 లో వర గురించి పెద్దగా రివీల్ అవ్వదు, దేవర పార్ట్ 2లో మాత్రం వర కోసం ఎక్కువ తెలుసుకుంటారు.అంతేకాకుండా అసలు దేవర కి ఏమైంది, అనే బ్యాక్ స్టోరీకి సమాధానం దేవర 2 లో దొరుకుతుంది అంటూ ఎన్టీఆర్ దేవర 2పై ఇచ్చిన బిగ్ అప్ డేట్ పై ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.దీన్నిబట్టి చూస్తే దేవర పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుంటుందని తెలుస్తోంది.
ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.మరి దేవర 2 ని ఎప్పుడు మొదలుపెడతారు చూడాలి మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy