ప్రధాని మోడీ తర్వాత టాప్ 10 లో నిలిచిన ఎన్టీఆర్... ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచిగా సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్(NTR ) ఒకరు.

ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2(War 2) సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  దర్శకత్వంలో  ఎన్టీఆర్ నటించబోతున్నారు.

ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది.ఇలా ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కానున్నాయి.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఒక అరుదైన రికార్డును సాధించారు.2024వ సంవత్సరంలో ట్విట్టర్లో అత్యధికంగా ప్రస్తావించిన పలువురు సెలబ్రిటీల జాబితాను విడుదల చేశారు .ఈ జాబితాలో ఎన్టీఆర్ టాప్ 10 లో ఉండటం విశేషం.

Jr Ntr Rank 10th On The List Of Most Talked Persons In Twitter 2024, Twitter, Na

ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) మొదటి స్థానంలో ఉండగా, ఎన్టీఆర్ పదవ స్థానంలో ఉన్నారు.ఈ జాబితాలో టాప్ టెన్ లో నిలిచినటువంటి టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్ మాత్రమే ఉండటం విశేషం.గత ఏడాది ఎన్టీఆర్ గురించి ట్విట్టర్లో పెద్ద ఎత్తున ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.

Advertisement
Jr Ntr Rank 10th On The List Of Most Talked Persons In Twitter 2024, Twitter, Na

తమిళ హీరో విజయ్ నాలుగో స్థానంలో నిలిచారు.బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ 8వ స్థానంలో ఉండగా ఎన్టీఆర్ పదో స్థానంలో ఉన్నారు.

ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు