రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు..!

టీపీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డ రేవంత్ రెడ్డిపై టీ.ఆర్.

ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడి కోసం కాగ్రెస్ పార్టీ కొండను తవ్వి ఎలుకని పట్టిందని టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఖతమైపోతుందని అన్నారు.

Jeevan Reddy Fires On Revanth Reddy Congress Party , Fires , Jeevan Reddy , Rev

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ శకం ఇక ముగిసినట్టే అని ఎద్దేవా చెశారు.రేవంత్ రెడ్డి ఖైదీ నెంబర్ 1799 అని విమర్శించారు జీవన్ రెడ్డి.

పదవులు వచ్చిన వారు హుందాగా ఉండాలని అన్నారు.సోనియా గాంధీ మెద సదాభిప్రాయం ఉండేదని రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఆ అభిప్రాయం పోయిందని అన్నరు జీవన్ రెడ్డి.

Advertisement

కాంగ్రెస్ పార్టీ అంటేనే జైలు పార్టీ అని విమర్శించారు.గల్లీ నుడి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని జీవన్ రెడ్డి అన్నారు.

బ్లాక్ మెయిన్ చేయడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని మండి పడ్డారు.రేవంతు జైలుకి వెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు.

ఇదిలాఉంటే పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ పార్టీ సీనియర్లను కలిసి వారి సలహాలు తీసుకుంటున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవడం పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారు.

మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు