రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వైసీపీ పై సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్..!!

ఈనెల 18వ తారీకు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ పార్టీలు ఎన్డీఏ ప్రెసిడెంట్ అభ్యర్థి ద్రౌప‌ది ముర్ముకు మద్దతు తెలపడం జరిగింది.

ఇటువంటి తరుణంలో సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ. వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి ఇతర పార్టీల మద్దతు అవసరమని దీంతో వైసిపి అవసరం కూడా ఏర్పడిందని అన్నారు.ఇటువంటి పరిస్థితులలో ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని వైసీపీ గట్టిగా బీజేపీ వద్ద డిమాండ్ చేయాలని కోరారు.

ఇది సరైన అవకాశం వైసీపీ ఉపయోగించుకోవాలని సూచించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధించటం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Advertisement

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వల్ల ఒరిగేదేమీ లేదని తెలిపారు.సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు మరియు చేస్తున్న అభివృద్ధి కచ్చితంగా అడిగి తెలుసుకుంటామని అన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు విషయంలో అన్ని పార్టీలు దృష్టి సారించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు