ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసారు - జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా కేసులకు సంబంధించి ఛార్జి షీట్ పేపర్లను ఎత్తుకెళ్లామని.

ఇందులో క్లర్కులకు 30 నుంచి 40లక్షలు ఇచ్చామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంపై జేసీ తీవ్రంగా స్పందించారు.ఆయన మొత్తం న్యాయ వ్యవస్థనే అవమానిస్తున్నారన్నారు.

Jc Prabhakar Reddy Fires On Mla Kethireddy Peddareddy, Jc Prabhakar Reddy , Mla

అసలు కోర్టులో పేపర్లు పోయిన విషయం ఇప్పటి వరకు పోలీసులే చెప్పలేదని.మరి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎలా తెలుసునని ఆయన ప్రశ్నించారు.

ఇందులో డీఎస్పీ పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు.ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చదువు సంధ్య లేని వాడని చాలా సార్లు చెప్పానని.

Advertisement

ఇలా కోర్టుకు సంబంధించిన అంశాలు మాట్లాడి తాడిపత్రి పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?
Advertisement

తాజా వార్తలు