జ‌య‌ల‌లిత కూతురు గురించి సంచల‌న నిజాలు

త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాలు ఒక్కొక్క‌టిగా సంచ‌ల‌నం రేపుతున్నాయి.

శ‌శిక‌ళ సీఎం పీఠం ఎక్కేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఓ పెద్ద సంచ‌ల‌నం అయితే, ఆమెకు జైలు శిక్ష ప‌డ‌డం, ప‌ళ‌నిస్వామి సీఎం కావ‌డం మ‌రో సంచ‌ల‌నం.

వీట‌న్నింటికీ మించి అమ్మ ఆత్మ‌బంధువు ప‌న్నీర్ సెల్వం పార్టీ నుంచి బ‌హిష్కృతుడు కావ‌డం మ‌రో పెను సంచ‌ల‌నం.ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అమ్మ‌కు ఓ కూతురు ఉందంటూ పెద్ద సంచ‌ల‌న వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Jayalalitha Daughter Reveals Secrets About Sasikala-Jayalalitha Daughter Reveals

ఎప్ప‌టి నుంచో ఊహాగానాల‌కే ప‌రిమిత‌మైన ఈ వార్త నిజ‌మేన‌ని, అమ్మ‌కు నిజంగానే ఓ కూతురు ఉంద‌ని ప్రియా మ‌హాల‌క్ష్మి అనే మ‌హిళే వెల్ల‌డించింది.ఎంజీఆర్, జ‌య సంబంధానికి జ్ఞాప‌కంగా ఓ కూతురు పుట్టింద‌ని, ఆమె పేరు ప్రియా మ‌హాల‌క్ష్మి అని ఈ మ‌హిళ వెల్ల‌డించింది.

అయితే, పాప చిన్న‌ప్పుడే జ‌య‌ ఆమెను దూరం చేసింద‌ని ఆరోపించింది.ఈ విష‌యాల‌న్నీ శ‌శిక‌ళ‌కు పూర్తిగా తెలుసున‌ని ఈమె చెప్పింది.

Advertisement

అయితే, ఆ త‌ర్వాత కాలంలో జ‌య ద‌గ్గ‌ర‌కు కుమార్తెను రాకుండా శ‌శిక‌ళే అడ్డుప‌డింద‌ని పేర్కొంది.అంతేకాదు, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రియా మహాలక్ష్మి వాదన ప్రకారం ఆమె ఇన్నాళ్లూ శశికళకు భయపడి అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోయింద‌ట‌.శశి జైలుకు వెళ్లిపోవడంతో ఆమె తెగించి బయటకు వచ్చిందట.

ఈ మహాలక్ష్మి ప్రస్తుతం ఓ కార్మికుల సంఘానికి కోశాధికారిగా ఉందని సమాచారం.దీంతో ఈ వార్త ఇప్పుడు త‌మిళ‌నాడులోనే కాకుండా ద‌క్షిణాది రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది.

ఒక‌ప‌క్క రాజ‌కీయ అస్థిర‌త‌తో అల్లాడుతున్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఈ విష‌యం ఏ మేర‌కు సంచ‌ల‌నం రేపుతుందో చూడాలి.

దసరా విలన్ పై మరో నటి ఆరోపణలు.. సెట్ లో అసభ్యంగా ప్రవర్తించారంటూ?
Advertisement

తాజా వార్తలు