గ్లోబల్ వైడ్ గా టాప్ 3 గ్రాసర్ గా జవాన్.. మొదటి రెండు మూవీస్ ఏవంటే?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్( Jawan ).

ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

అందులోను షారుఖ్ పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తో కొన్నేళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.ఇదే ఊపులో వెంటనే జవాన్ సినిమాను చేయడంతో ఈ సినిమా కూడా ఓ రేంజ్ లో అంచనాలతో రిలీజ్ అయ్యింది.

Jawan Box Office Collection Record, Jawan Movie, Shahrukh Khan, Atlee Kumar, Jaw

కృష్ణాష్టమి సందర్భంగా వరల్డ్ వైడ్ గా జవాన్ రిలీజ్ అవ్వడంతో అప్పటి నుండి థియేటర్స్ లో జవాన్ మానియా స్టార్ట్ అయ్యింది.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మించగా అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichandran ) మ్యూజిక్ అందించారు.

కాగా ఇందులో దీపికా పదుకొనె కీ రోల్ పోషించింది.కథ, యాక్షన్, క్యాస్ట్ అన్ని కలిపి ఈ సినిమా పఠాన్ ను మించిన హిట్ అయ్యి షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో హిట్ పడేలా చేసింది.

Advertisement
Jawan Box Office Collection Record, Jawan Movie, Shahrukh Khan, Atlee Kumar, Jaw

ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ ఈ సినిమా విషయంలో ఒక్కొక్కటిగా రికార్డ్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు.ఈ సినిమా ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

Jawan Box Office Collection Record, Jawan Movie, Shahrukh Khan, Atlee Kumar, Jaw

ఈ సినిమా షారుఖ్ కెరీర్ లో మరో 1000 కోట్ల గ్రాసర్ గా దూసుకెళ్తున్న సమయంలో లేటెస్ట్ గా సెన్సేషనల్ ఫీట్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.వరల్డ్ వైడ్ గా టాప్ 3 గ్రాసర్ గా గత వీకెండ్ కలెక్షన్స్ తో నిలిచింది.మొదటి రెండు స్థానాల్లో కూడా హాలీవుడ్ చిత్రాలు( Hollywood movies ) ఉండగా టాప్ 3 లో జవాన్ నిలిచింది.

జవాన్ హైయెస్ట్ వసూళ్లు అందుకున్న ఏకైక సినిమాగా ఈ ఖాతాలో చేరిపోయింది.మొత్తంగా 800 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు