స్వయంగా నేనే చెప్పాలనుకున్నా... తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడిన జాన్వీ!

దేవర సినిమా( Devara Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ).

దివంగత నటి శ్రీదేవి ( Sridevi ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈమె త్వరలోనే దేవర సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చారు.నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాట్ టెల్ హోటల్లో ఘనంగా జరగాల్సి ఉండగా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి రావడంతో సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతున్న తరుణంలో ఈ వేడుకను క్యాన్సిల్ చేశారు.

ఈ తరుణంలోనే ఎన్టీఆర్ ( NTR ) తో పాటు నటి జాన్వీ కపూర్ సైతం సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలను విడుదల చేశారు.అయితే ఈమె విడుదల చేస్తున్న వీడియోలో అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడటంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.ఇక ఇందులో భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం.

నన్ను ఇంతలా ఆదరిస్తూ నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

ఇక మా అమ్మ అంటే మీకు ఎంత ముఖ్యమో మీరు అన్న కూడా అమ్మకు,నాకు అంతే ముఖ్యమని తెలిపారు.నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడే రోజు కోసం తాను కష్టపడతానని వెల్లడించారు.దేవర సినిమా నా మొదటి అడుగు.

ఈ సినిమాలో హీరోయిన్గా నన్ను ఎంపిక చేసినందుకు కొరటాల శివ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు