పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లిన ఆయన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పవన్ మాట్లాడుతూ కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని చెప్పారు.ఒకవేళ పొత్తులు కుదరకపోతే ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని తెలిపారు.

తెలంగాణ తనకు పునర్జన్మను ఇచ్చిందన్న పవన్ జనసేన తెలంగాణలోనూ పని చేస్తుందని పేర్కొన్నారు.వారాహి అంటే దుష్టులను శిక్షించేదని, పొత్తులపై కాలమే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు