వ్యక్తిగత విబేధాలు మర్చిపోవాలంటూ జగన్‌కు పవన్ విజ్ఞప్తి..

గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ సర్కార్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైసీపీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.దాంతో వైసీపీ నేతలు పవన్‌కు దీటుగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఏపీలోని రహదారుల దుస్థితికి నిరసనగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పవన్ శ్రమదానం కార్యక్రమం చేపట్టారు.ఈ వ్యవహారంలోనూ జనసేన, వైసీపీ సర్కార్ మధ్య కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అయితే ఈ స్థాయిలో పవన్ జగన్‌పై మండిపడుతున్న నేపథ్యంలో ఒక సంచలన అంశం రాజకీయ వర్గాల్లో వాడీవేడీ చర్చకు దారి తీసింది.సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయగా.

Advertisement
Janasena Leader Pawan Kalyan Requests Jagan , YS Jagan, Film Industry, Pawan Com

ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందట.పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టాలీవుడ్ ప్రతినిధులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

పవన్ ప్రసంగం అనంతరం టాలీవుడ్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని కలుసుకున్నారు.పవన్ వివాదాస్పద వ్యాఖ్యలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని వారు పేర్ని నానికి తెలియజేశారు.

అనంతరం దిల్ రాజు నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ని కలిశారు.చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని హామీ ఇవ్వాలంటూ పవన్‌కు విజ్ఞప్తి చేశారు.

అందుకు పవర్‌స్టార్‌ సానుకూలంగా స్పందించారు.దాంతో సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

పవన్‌చే జగన్ ప్రభుత్వానికి బహిరంగ వీడియో అప్పీల్ ఇచ్చేలా చేసారని తెలుస్తోంది.

Janasena Leader Pawan Kalyan Requests Jagan , Ys Jagan, Film Industry, Pawan Com
Advertisement

ఆ వీడియోలో పవన్ మాట్లాడుతూ.తనతో వ్యక్తిగతంగా ఉన్న విభేదాలు మరచి సినిమా పరిశ్రమకు న్యాయం చేయాలని జగన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు సమాచారం.మూవీ టికెట్ ధరలను పెంచేందుకు అనుమతించాలని.

టాలీవుడ్‌ను కష్టాల నుంచి గట్టెక్కించేలా చర్యలు తీసుకోవాలని ఆయన జగన్‌ని కోరారని టాక్.అయితే పవన్ చేసిన ఈ వీడియో మీడియాకు విడుదల చేయాల్సిన బాధ్యతను ఓ సినీ నిర్మాతకి టాలీవుడ్ పెద్దలు అప్పగించారు.

కాగా ఈ వీడియో విడుదలైన తర్వాత అందులో పవన్ చేసిన వీడియో అప్పీల్ కనిపించకుండా పోయింది.కేవలం టాలీవుడ్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని అభ్యర్థించిన దృశ్యాలు తప్ప పవన్ కి సంబంధించి ఎలాంటి వీడియో క్లిప్ కనిపించలేదట.

దీంతో టాలీవుడ్ ప్రతినిధులు షాక్ అయ్యారని తెలుస్తోంది.నిజానికి పవన్ అనుమతి లేకుండా అతని వీడియోని డిలీట్ చేయడం లేదా ఎడిట్ చేయడం వంటివి ఎవరూ చేయడానికి సాహసించరు.

దీన్ని బట్టి స్వయంగా పవన్‌యే ఆ వీడియోని డిలీట్ చేసి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.జగన్‌ని అభ్యర్థించడం తన స్థాయికి తక్కువగా భావించి పవన్ బహుశా సదరు నిర్మాత చేత ఆ వీడియో డిలీట్ చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ ఏ నిర్మాత కూడా వీడియో డిలీట్ చేసినట్టు ఒప్పుకోకపోవడం కొసమెరుపు.ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో వార్త రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

తాజా వార్తలు